27, నవంబర్ 2016, ఆదివారం

నేను

నేను అనే పదం ఒక అమాయకత్వం.      కానిది, కూడనిది కాదది అత్యల్పం.
పసిపిల్లాడు టక్కున అంటాడు. ఎదిగాక తెలియక అంటారు.
నేను ఎవరని ప్రశ్నించు ఒకసారి, చెప్పేనో మది  నీకు నిజాన్ని
నేను నేనేనని విర్రవీగేవో, తాతల పౌరుషాన  మీసం తిప్పేవో
రక్తసంబంధం గుర్తుకు తెచ్చేవో, పదవుందని  దర్పం చూపేవూ
అది నీ మానసయ్యా  దానికి నిజమెప్పుడో ఎరుకయ్యా.............   

పరిచయం

నా పేరు శ్రీరామ్. 
                   మనిషి తనలో ఉన్న చాలా ఫీలింగ్స్ బయటకి చెప్పడు. చాలా సార్లు బయటపడినా ఒప్పుకోడు. కారణం ఏదైనా అయ్యుండొచ్చు, పరిస్థితి చెప్పమని ప్రాధేయపడొచ్చు కానీ గొంతు దాటనని మొండికేసిన పదాలను ఒడిసిపట్టి ఒక పేజీలో రాయాలనే ఆశ ___________ ఈ మై ఫీలింగ్స్ బ్లాగ్.